MLC Anantha Babu Car: ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈకేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని గుర్తించారు. ఎమ్మెల్సీ అనంతబాబే స్వయంగా మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఐదు నెలల కిందట ఎమ్మెల్సీ వద్ద అతడు డ్రైవర్‌గా పని మానేసినట్లు విచారణలో తేలింది. ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి రూ.20 వేలు అప్పు తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. నెలకు ఐదు వేల చొప్పున ఇచ్చేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరిందని అంటున్నారు. డబ్బు ఇచ్చే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని..ఒక వేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని చెబుతున్నారు.
ఈక్రమంలోనే అతడు చనిపోవడం పలు అనుమానాలను కల్గిస్తోంది. ఆర్థిక లావాదేవీల వల్లే హత్య చేశారని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో చంపి..మృతదేహాన్ని తీసుకొచ్చారని వాపోతున్నారు. హత్యను రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. టిఫిన్ కోసం వెళ్లి బైక్ ప్రమాదానికి గురైయ్యారని చెబుతున్నారని..తాము నమ్మడం లేదని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు(MLC ANANTHA BABU), ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. కారులోంచి మృతదేహాన్ని దించే సమయంలోనే తమకు అనుమానం వచ్చిందని చెబుతున్నారు. దీనిపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్సీని నిలదీస్తే..అక్కడ నుంచి జారుకున్నారని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
Also read:Disha Case: సిర్పుర్కర్ కమిషన్ నివేదిక తేటతెల్లం..పోలీసుల గుండెల్లో రైళ్లు..!
Also read:Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
MLC Anantha Babu Car: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ట్విస్ట్..ఆర్థిక లావాదేవీలున్నాయా..?
ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి
తెరపైకి కీలక అంశాలు
హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు అనుమానాలు