AP Assembly Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు గురించి చర్చల్లో ఉండగానే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుసగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా నాలుగో జాబితాను ప్రకటించారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది పేర్లను ప్రకటించగా.. నాలుగో జాబితాలో 9 మంది పేర్లను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ లిస్ట్‌లో 8 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక ఎంపీ స్థానం ఉంది. చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంఛార్జీగా నియమించారు. రెడ్డప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇంఛార్జీగా నియమించారు.
తొలి మూడు జాబితాల్లో భారీ మార్పులు చేసిన సీఎం జగన్.. నాలుగో జాబితాలో కూడా అభ్యర్థులను మార్చారు. శింగనమల అసెంబ్లీ స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉండగా.. ఆమె స్థానంలో వీరాంజనేయులను ఇంఛార్జీగా నియమితులయ్యారు. మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్పను నియమించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ స్థానంలో డాక్టర్ సుధీర్ దారాను ఇంఛార్జీగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్ల కొవ్వూరు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి తానేటి వనితను ఈసారి గోపాలపురం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు పేరును ఖరారు చేశారు. తిరువూరు, కనిగిరి అసెంబ్లీ స్థానాల నుంచి కూడా కొత్తవాళ్లు అభ్యర్థులుగా నియమితులయ్యారు.
ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నాలుగో జాబితా ఇలా..
==> జీడీ నెల్లూరు (SC)- ఎన్.రెడ్డప్ప
==> శింగనమల (SC) - ఎం.వీరాంజనేయులు
==> తిరువూరు (SC) - నల్లగట్ల స్వామిదాసు
==> కొవ్వూరు (SC) - తలారి వెంకట్రావు
==> నందికొట్కూరు (SC) - సుధీర్ దార
==> మడకశిర (SC) - ఈర లక్కప్ప
==> కనిగిరి - దద్దాల నారాయణయాదవ్
==> గోపాలపురం (SC) - తానేటి వనిత (హోం మంత్రి)
==> చిత్తూరు పార్లమెంట్ (SC) - కె.నారాయణస్వామి
==> శింగనమల, నందికొట్కూరు, మడకశిర, తిరువూరు, కనిగిరిలో కొత్త ముఖాలు
==> కొవ్వూరు, గోపాలపురం సిట్టింట్‌లు తారుమారు
==> చిత్తూరు ఎంపీ.. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గానూ, ఇక్కడ ఎమ్మెల్యే చిత్తూరు ఎంపీగానూ మార్పు.
Also Read: TS Politics: ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సెలైంట్.. జెండా పీకేసినట్లేనా..!
Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter