లోక్‌సభలో సభ్యుల ప్రమాణస్వీకారం; మన ఎంపీలు తెలుగులోనే ప్రమాణం

లోక్ సభ తొలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.

Last Updated : Jun 17, 2019, 12:57 PM IST
లోక్‌సభలో సభ్యుల ప్రమాణస్వీకారం; మన ఎంపీలు తెలుగులోనే ప్రమాణం

ఢిల్లీ: పదిహేడో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన వీరేంద్రకుమార్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సంద్భంగా తొలుత సభాపక్ష నేత వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ఎంపీగా ప్రమాణం చేశారు. భగవండిపై ప్రమాణం చేస్తూ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. 
తెలుగులోనే  ప్రమాణం....
ప్రధాని మోడీ ప్రమాణస్వీకారంం అతంతరం  కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.  అతంతరం మిగిలిన సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ సందర్బంగా తెలుగు ఎంపీలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మన తెలుగు రాష్టాల్లో ఎన్నికైన ఎంపీ  సభ్యులు తెలుగులోనే ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం

బుధవారం స్పీకర్ ఎన్నిక

లోక్ సభ నిబంధనలు ప్రకారం ముందు కేంద్రమంత్రులు, ప్యానెల్‌ ఛైర్మన్లు ముందు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు జరుగుతాయి. ఈ రోజు ప్రారంభమైన ప్రమాణస్వీకారం ప్రక్రియ  రేపుటి వరకు జరుగుతుంది. కాగా బుధవారం స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఈ రోజు జులై 26 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. 

Trending News