Nagababu: రాజకీయాల్లో దొంగలు పడ్డారు..: మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu: వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మెగా బ్రదర్ నాగబాబు. ఏపీకి రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 10:35 PM IST
Nagababu: రాజకీయాల్లో దొంగలు పడ్డారు..: మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Mega Brother Nagababu Comments: జనసేన ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) సభ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తనుద్దేశించి మాట్లాడారు జనసేన నాయకులు నాగబాబు (Nagababu). మూడేళ్లుగా రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఆయన అన్నారు. రాజధానిపై కోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని...పై కోర్టులకు వెళ్లడం మానుకోవాలని సూచించారు మెగా బ్రదర్. లేదంటే ఐదేళ్లపాటు క్యాపిటల్ లేకుండా పాలించిన ఘనత తమకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 

జగన్ పాలనలో సీఎం, ఆయన సలహాదారులు తప్ప ఎవరైనా బాగున్నారా? అని నిలదీశారు. మంత్రులు సైతం అసహనంగా ఉన్నారని.. చేయడానికి పనిలేక కొందరు మంత్రులు ఫోన్లలో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు.  రాజకీయాల్లో దొంగలు పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. జగన్ పాలనలో విధ్వంసం తప్పు అభివృద్ది లేదన్నారు. తనకు బ్రదర్ అయినప్పటికీ పార్టీ పరంగా పవనే తన నాయకుడిని ...పవన్ ఆశయాల కోసం ఓ జనసైనికుడిగా కృషి చేస్తానని అన్నారు నాగబాబు. 

2024లో అధికారం జనసేనదే: పవన్ 
జనసేన ఆవిర్భావ సభలో జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan). 2024లో తాము అధికారంలోకి వచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతేనని ఆయన అన్నారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయడమే జనసేన లక్ష్యమని పవన్ చెప్పారు. వైకాపా వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని.. ఎన్నికల సమయంలో పొత్తులు గురించి ఆలోచిస్తామంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Pawan kalyan: రాజధాని అమరావతే.. 2024లో అధికారం మాదే..: పవన్‌ కల్యాణ్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News