Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత!

మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 09:46 PM IST
Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత!

Maoist leader RK dead: మావోయిస్టు అగ్రనేత ఆర్కే(Maoist leader RK) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇతని పూర్తిపేరు.. అక్కిరాజు హరగోపాల్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్‌(Bastar Forest) అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు(Chhattisgarh Police) ధ్రువీకరించలేదు. 

వైఎస్ హయాంలో..
దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులున్నాయి. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబు(Chandrababu)పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. బలిమెల ఎన్‌కౌంటర్‌(Balimela Encounter) నుంచి  ఆర్కే తృటిలో తప్పించుకోగా.. ఈఘటనలో ఆయనకు బుల్లెట్‌ గాయమైంది. 2004 అక్టోబరు 15న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (CM YS Rajasekhar Reddy)హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50లక్షల రివార్డును పోలీసుశాఖ ప్రకటించింది. 

Also read: Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

ఉద్యమంలో కీలకపాత్ర
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు.  వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి  పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ప‌ద్మ‌జ‌ను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్య‌మంలో ప‌నిచేశారు. ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేశారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచ‌ర్‌గా ప‌నిచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News