Gorla Venugopal Reddy Joins in TDP: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తుంటే.. అక్కడక్కడ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు, వైసీపీ నాయకుడు గొర్ల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో పాటు కొంతమంది వైసీపీ కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకెళ్లారు. నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారిందని విమర్శించారు. గంజాయి మత్తులో సీఎం ఇంటి పరిసరాల్లో మృగాళ్లు అత్యాచారాలకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే విధ్వంసం సృష్టిస్తున్నారని.. పేదల ఇళ్లు కూల్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆర్కే పాల్పడుతున్న అవినీతి, అరాచకాలపై నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదంటే.. అంగీకరిస్తున్నట్లేనని అన్నారు.
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతుండడంతో టీడీపీలోకి చేరికలు ఎక్కువ అవుతున్నాయన్నారు నారా లోకేష్.వేణుగోపాల్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఆయనలాంటి వాళ్లు ఎందరో కష్టపడితే వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. కానీ ముఖ్యమంత్రి జమానాలో నలుగురు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే బాధితుడు వేణుగోపాల్ రెడ్డి అని.. ఆయనలాంటి బాధితులు అంతా కలిసి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలోకి తీసుకువెళదామని.. అరాచక పాలనను అంతం చేద్దామన్నారు.
'జగన్ మోహన్ రెడ్డిని సీఎంను చేసేందుకు రాష్ట్రంలో ఎంతోమంది రెడ్డి సామాజిక వర్గానికి కష్టపడి పని చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ మోసం చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే జగన్ పోవాలి.. చంద్రబాబు నాయుడు గారు రావాలి. గత ఎన్నిల్లో వైసీపీ గెలుపు కోసం కష్ట పడి పనిచేసిన వారందరినీ తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట నిలబెడుతున్నారు. వైసీపీలో అన్యాయం జరిగిన వారందరూ టీడీపీలోకి రండి..' అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతంటే..?
Also Read: Blast in istanbul: ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 81 మందికి గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి