ఏపీలో వేసవిని తలపించే స్థితి; ఆందోళనకరంగా భూగర్భ జలాల పరిస్థితి

                                     

Last Updated : Nov 27, 2018, 09:25 AM IST
ఏపీలో వేసవిని తలపించే స్థితి; ఆందోళనకరంగా భూగర్భ జలాల పరిస్థితి

ఏపీలో ఈ సారి సరైన వర్షపాతం నమోదు కాలేదు. సాధారణం కంటే 40 శాతం నీటి మట్ట తగ్గువగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది. నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి.  రాష్ట్రం మొత్తం మీద సగటున 34.60 శాతం వర్షపాతం లోటు కనిపిస్తోంది. దీనికి తోడు నీటి వినియోగం గతంలో కంటే ఎక్కువ నమోదు కావడంతో నీటి మట్టం 40 శాతం తగ్గిందని అధికారులు అంచనావేస్తున్నారు. 

వర్షం పాతం నమోదు విషయంలో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరులోనూ పరిస్థితి దారుణంగా ఉంది. కురువాల్సిన వర్షంలో దాదాపు సగం మేర ( 48.30 శాతం ) వర్షం కురవలేదు. దీనికి తోడు బోర్ల సంఖ్యా అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. రాయలసీమలో జిల్లాల వారీగా పిరిస్థితిని సమీక్షించినట్లయితే  కడప జిల్లాలో 57 శాతం.. కర్నూలో 50 శాతం, అనంతపురంలో 45.60 శాతం, చిత్తూరులో 42 శాతం లోటు కనిపిస్తోంది. దీంతో భూగర్భజలాల నీటిమట్టం రాయలసీమ 4 జిల్లాల్లో మే నెల కన్నా 2.28 మీటర్ల దిగువకు పడిపోయాయి.

ఇక దక్షిణ కోస్తాలోని  ప్రకాశం, నెల్లూరు గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి అద్వానంగా ఉంది. ప్రకాశం 57.60..నెల్లూరులో 54.90 శాతం లోటు ఉంది. గుంటూరులో 41.10 శాతం లోటు ఉంది. దీని ప్రభావంతో భూగర్జ జలాల నీటిమట్టం ప్రకాశం జిల్లాలో 1.53 మీటర్ల దిగువకు అడుగంటిపోగా..నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో దాదాపు మీటరు మేర నీటి మట్టాలు పడిపోయాయి.

మనం వ్యవసాయానికి కావాల్సిన సాగు నీరు కోసం ఎక్కవగా భూర్భజలాలపై ఆధారపడి ఉన్నాం. భూగర్భ జాలాలను ఎక్కువగా శీతాకాలం, వేసవి కాలం అవసరాలకు వాడుకుంటున్నాం. ఈ సారి ఆయా జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమెదు కావడంతో  ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపాతం తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. నవంబర్ లోనే మే నెలను తలపిస్తోంది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గలను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వాలు తీసుకునే చర్యలపై మన భవితవ్యం ఆధారపడి ఉంది.

 

 

Trending News