ఏపీలో పిడుగులు పడే సూచనలు.. ఆర్టీజీఎస్ హెచ్చరికలు

ఏపీలో పిడుగులు పడే సూచనలు.. ఆర్టీజీఎస్ హెచ్చరికలు

Last Updated : May 11, 2019, 11:30 PM IST
ఏపీలో పిడుగులు పడే సూచనలు.. ఆర్టీజీఎస్ హెచ్చరికలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు. అధికారుల హెచ్చరికల ప్రకారం విశాఖ‌ జిల్లా పెద‌బ‌య‌లు, జి. మాడుగుల‌, పాడేరులో పిడుగుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గుంటూరు జిల్లాలో బెల్లంకొండ‌, దాచేప‌ల్లి, మాచ‌వ‌రం, కారంపూడి, గుర‌జాల‌, రెంట‌చింత‌ల‌, మాచ‌ర్ల, దుర్గి, ఈపూరు, నకరికల్లులో మండలాల్లోనూ పిడుగులు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 

ఇక ప్రకాశం జిల్లా విషయానికొస్తే, అద్దంకి, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం, నాగులుప్పలపాడు, క‌నిగిరి, టంగుటూరు, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో పిడుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Trending News