Lemon Price: మార్కెట్లో నిమ్మకాయలకు భారీ డిమాండ్- ఒక్క నిమ్మకాయ ధర రూ.10!

Lemon Price: ఈ ఏడాది వేసవి మండిపోనుంది. మార్చి మొదటి వారం నుంచే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొబ్బరి నీళ్లు, నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఒక్కో నిమ్మకాయను రూ.10 చొప్పున అమ్ముతుండగా.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో కిలో నిమ్మకాయలను రూ. 130 నుంచి రూ. 160 ధరకు విక్రయిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 11:45 AM IST
Lemon Price: మార్కెట్లో నిమ్మకాయలకు భారీ డిమాండ్- ఒక్క నిమ్మకాయ ధర రూ.10!

Lemon Price: మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏకంగా రోజుకు 30 డిగ్రీల సెల్సియస్ కు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ఎండల ధాటికి ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా.. ఇప్పుడు నిమ్మకాయల ధరలకు కూడా అమాంతం రెక్కలొచ్చాయి. యాపిల్ పండ్ల ధరకు పోటీగా నిమ్మకాయలను విక్రయిస్తున్నారు. 

ఎండల కారణంగా నిమ్మకాయలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఒక్కో నిమ్మకాయని రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడురు కూరగాయల మార్కెట్లో కిలో నిమ్మకాయలను రూ. 160 చొప్పున అమ్ముతున్నారు. 

ఈ నిమ్మకాయల్లో రెండో రకం శ్రేణిని రూ. 130 నుంచి ర. 150 మధ్య విక్రయిస్తున్నారు. మూడో రకం కాయలను రూ. 100 నుంచి రూ. 130 మధ్య అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నిమ్మకాయల ధర ఎక్కువగా పలుకుతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునే యాపిల్ పండ్లు కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తుండడం గమనార్హం.   

Also Read: AP New Districts: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు.. సీఎం జగన్ సందేశం!

Also Read: Pawan Kalyan: కౌలు రైతులకు అండగా పవన్... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News