బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పవన్ విషయంలో ఇక ఉపేక్షిస్తే నష్టపోతామని భావించిన బీజేపీ ఆయనపై విమర్శల దాడి చేసేందుకు సిద్ధమైంది. అందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కిషన్ రెడ్డి శంఖారావం పూరించారు. పవన్ రాజకీయంపై ఆయన మాట్లాడుతూ నటించడమే రాని పవన్ ..రాజకీయాల్లో ఎలా నెగ్గకు రాగలడని ప్రశ్నించారు. వాస్తవానికి పవన్ కు మీడియాలో పెద్ద నాయకుడిగా చూపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.