Electric Battery Unit: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. త్వరలో ఏపీలో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్ ఏర్పాటవబోతోంది.
నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికై ఏపీ ప్రభుత్వం(Ap government)తీసుకుంటున్న చర్యలు ఆశించిన ప్రయోజనాల్ని కల్గిస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. మరో ప్రముఖ కంపెనీ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీస్ భారీ పరిశ్రమ స్థాపించేందుకు సిద్ధమైంది.
ఏపీలో త్వరలో 1750 కోట్ల వ్యయంతో ఎలక్ట్రిక్ టూ వీల్ అండ్ త్రీ వీల్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు (Electric Vehicles Battery Unit)కానుంది. దాంతోపాటు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్(Kinetic Green Energies)ఈ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో సులజ్జ ఫిరోదియా తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు. విశాఖపట్నంలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సంస్థ ఆసక్తిగా ఉందని వైఎస్ జగన్‌కు(Ap cm ys jagan)వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కైనెటిక్ గ్రీన్ ప్రతినిధులు తెలిపారు.
Also read: Badvel Bypoll: బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల, అమల్లో వచ్చిన కోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి