వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ రోజు వైకాపా గూటికి చేరారు.

Last Updated : Apr 29, 2018, 03:51 PM IST
వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ రోజు వైకాపాలో చేరారు. శనివారం మధ్యాహ్నం 250 వాహనాల్లో కాటసాని తన మద్దతుదారులతో భారీగా తరలివెళ్లారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లా కనుమూరు వద్ద వైకాపా అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  

జగన్‌మోహన్ రెడ్డి కాటసానిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్‌తో కలిసి నడవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాటసాని వెంట పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, పాణ్యం, గడివేముల, ఓర్వకల్లుతో పాటు కల్లూరు అర్బన్ వార్డుల మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు వైసీపీ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కాటసాని ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి వైకాపా అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. ఆతరువాత బీజేపీలో చేరిన ఆయన నేడు వైకాపా గూటికి చేరారు. దీంతో పాణ్యం రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో రసవత్తరంగా మారనున్నాయి.

Trending News