Poll Survey : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రధాన దృష్టి ఉంది. ఈసారి ఆంధ్రలో ఎవరు గెలుస్తారనే సర్వత్రా చర్చ.. ఉత్కంఠ నెలకొని ఉన్న పరిస్థితుల్లో పలు సర్వేలు బయటకు వస్తున్నాయి. ఆ సర్వేల్లో ప్రజా నాడీ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు రాగా తాజాగా అత్యంత విశ్వసనీయత కలిగిన జన్‌మత్ పోల్స్ తమ సర్వేను వెల్లడించింది. ఈ సర్వేలో ప్రజా తీర్పు ఎవరికో స్పష్టంగా ఉందని పేర్కొంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకుంటారని ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రతిపక్ష కూటమి అర్ద సెంచరీ కూడా చేయదని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుండగా.. ప్రతిపక్ష కూటమి మాత్రం ఇంకా ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ తేదీ కోసం ఎదురుచూస్తున్న వైసీపీ రెండోసారి విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఈసారి తమదే అధికారమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రజల మదిలో ఏముందనేది సర్వే సంస్థలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జన్‌మత్ పోల్స్ తన సర్వేను విడుదల చేసింది.
Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తుందని వెల్లడించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 120 నుంచి 123 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని పేర్కొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా ఈసారి దక్కడం కలగానే ఉండిపోతుందని జన్‌మత్ పోల్స్ తెలిపింది. ఎన్నికల్లో 46 నుంచి 48 సీట్లు మాత్రమే వస్తాయని తన సర్వేలో స్పష్టం చేసింది. అంటే కనీసం అర్ధ సెంచరీ సీట్లు కూడా పొందలేదని సర్వే నివేదికలో జన్‌మత్ సంస్థ వివరించింది. ఇదే సంస్థ గత నెలలో విడుదల చేసిన సమయంలో కూడా ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారని తెలిపింది. అయితే తాజాగా ప్రజలు జగన్‌కు మరింత దగ్గరవుతున్నారని.. ఈ ప్రభావంతో వైసీపీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని జన్‌మత్ తెలిపింది.
ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 'సిద్ధం' పేరిట సుడిగాలి పర్యటన చేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రస్తుతం 'మేమంతా సిద్ధం' అంటూ బస్సు యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు 'ప్రజాగళం' పేరిట సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో అంతగా పాల్గొనడం లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన చేపట్టిన 'వారాహి విజయ భేరీ' అనేక వాయిదాలతో కొనసాగుతోంది. ప్రజలు ఇప్పటికే తమ ఓటు ఎవరికీ వేయాలో నిర్ణయించుకున్నారని.. ప్రచారం ఎంత చేసినా జగన్ సీఎం కావడం ఖాయమని ప్రధాన మీడియా సంస్థలు, వివిధ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook