Varma on Pawan Kalyan: ఎవరికోసమో నేను సీటు వదులుకోను, పవన్ వ్యాఖ్యలపై పిఠాపురంలో దుమారం

Varma on Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురంలో మరోసారి రచ్చ మొదలైంది. ఆ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ వర్మ మరోసారి రెచ్చిపోయారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2024, 05:05 PM IST
Varma on Pawan Kalyan: ఎవరికోసమో నేను సీటు వదులుకోను, పవన్ వ్యాఖ్యలపై పిఠాపురంలో దుమారం

Varma on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిస్తన్నాయి. పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకోడానికి సిద్ధమైన ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్డ్ ఎస్వీఎస్ఎన్ వర్మ స్వరం మార్చారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ఏపీలో ఎక్కడ్నించి పోటీ చేసేది నిర్ణయించేందుకు వివిధ రకాల పరిశీలనల అనంతరం పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. అయితే చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడటంతో శాంతించిన వర్మ పవన్ కళ్యాణ్‌ను దగ్గరుండి గెలిపిస్తానంటూ ప్రకటించారు. అంతా సద్దుమణిగిందనుకునేలోగా పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా టీ టైమ్ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన పవన్ కళ్యాణ్...అమిత్ షా ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అదే జరిగితే తన స్థానంలో పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. 

ఈ వ్యాఖ్యలతో మళ్లీ దుమారం రేగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈసారి భిన్నంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకుంటే తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే తాను పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని లోపల బాధగా ఉన్నా వదులుకున్నానన్నారు. ఇప్పుడు మరెవరో పోటీ చేస్తానంటే తానెలా వదులుకుంటానని చెప్పారు. 

అటు పవన్ కళ్యాణ్ ఇటు ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలతో పిఠాపురంలో గందరగోళం ఏర్పడింది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య రగడ ప్రారంభమైంది. తాను సీటు వదులుకున్నది కేవలం పవన్ కళ్యాణ్ కోసమేనని, మరెవరో పోటీ చేస్తానంటే తాను కూడా పోటీకి సిద్ధమౌతానని స్పష్టం చేసి కలకలం రేపుతున్నారు. 

Also read: AP Elections 2024: ఏపీ మూడు పార్టీల్లో సీట్ల పంచాయితీ, బీజేపీకు అదనంగా మరో స్థానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News