విశాఖలో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హల్చల్ చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సమయంలోనే పవన్ ..ప్రధాని మోదీని కలవనుండటం దేనికి సంకేతమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
ఇటీవల విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విశాఖ గర్జన రోజే..జనసేన అధినేత విశాఖ పర్యటన ఎంతటి హంగామా సృష్టించింది..ఎంతటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తనుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే.. ప్రధాని మోదీ సభను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భుజాలకెత్తుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మోదీ సభ అనేకంటే..వేసీపీ సభ అనడమే మంచిది. ఎందుకంటే ఏర్పాట్లు వైసీపీనే స్వయంగా చేస్తోంది. సభకు పెద్దఎత్తున జనాన్ని సమీకరిస్తోంది.
ఇప్పుడు సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశమైంది. వైసీపీ సభకు పవన్ ఎంట్రీ సంచలనంగా మారింది. ప్రధాని మోదీ విశాఖలో ఉండే రెండ్రోజులు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండనున్నారు. దీనికి సంబంధించి స్పెషల్ ఫ్లైట్ కూడా బుక్కైంది. అంతేకాదు.. ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రేపు రాత్రి 8.30 గంటలకు ఈ భేటీ ఖరారైందని తెలుస్తోంది.
ప్రధాని మోదీతో జరిగే పవన్ కళ్యాణ్ భేటీలో ఏపీ రాజకీయాల్లో పొత్తుల అంశం కచ్చితంగా చర్చకు రానుందని సమాచారం. వైసీపీకు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రధాని భేటీలో ఆ రోడ్ మ్యాప్‌పై స్పష్టత వస్తుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుపై కూడా మోదీతో సమావేశం అనంతరం స్పష్టత రావచ్చు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ విశాఖ ఆకస్మిక పర్యటన వైసీపీ వర్గాల్ని కలవరపెడుతోంది. ప్రధాని మోదీతో సమావేశం కానుండటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి విశాఖ గర్జనలో పవన్ కళ్యాణ్ ప్రధాన ఆకర్షణగా మారి మీడియా కవరేజ్ సొంతం చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరగనుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
Also read: Pawan Kalyan: ముళ్లును ముళ్లుతోనే తీసినట్లు.. వేమన విగ్రహం తొలగింపుపై పద్యం రూపంలో పవన్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook