Pawan Kalyan On Alliance With TDP: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అజెండా కోసం తాము పని చేయమని స్పష్టం చేశారు. తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరిందన్నట్లుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. తాను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోనని అన్నారు. మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్లనని.. ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని చేయనని తేల్చి చెప్పారు. ఆదివారం జరిగిన కాపు సంక్షేమ సేన భేటీలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
అధికారం చేజిక్కిచ్చుకొలేని కులాలలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఉన్నాయని.. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్ అడుక్కునే పరిస్థితి ఉందన్నారు జనసేనాని. కులాన్ని పట్టించుకునే నాయకులు ఎవరూ లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నచేగొండి హరిరామ జోగయ్యకు ధన్యవాదాలు తెలిపారు. బయట కులాలను విమర్శించడం కాకుండా.. మన కులంలో ఉన్న తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా కాపులు అధికారంలోకి రాకపోవడానికి కారణం తెలుసుకుని.. దానికోసం పనిచేయాలన్నారు. కాపులు అధికారంలోకి వస్తే ఇతర కులాలకు అన్యాయం జరుగుతుందనే తప్పుడు ప్రచారం జరుగుతుందని.. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లినప్పుడే కాపులు అధికారం సాధిస్తారని అన్నారు.
'నేను పుట్టడం కాపు కులంలో పుట్టి ఉండొచ్చు.. కానీ నా మనసు అధికారానికి దూరంగా ఉన్న రెల్లి లాంటి కులాల మధ్య ఉంటుంది. వారికి కూడా రాజ్యాధికారం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రాజ్యాధికారం చేతకాదు అని మాట్లాడేవారు చెంప పలిగేలా ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి. కొంతమంది ఈ మధ్య తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అలాంటివి నమ్మకండి, వారు అలానే చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యుడలిస్తిక్ మనస్తత్వం ఎలా ఉందంటే.. మీ కులంలో ఎలాంటి వ్యక్తిని అయినా తిట్టండి.. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే నా దగ్గర వచ్చి చేతులు కట్టుకోండి అనే రకంగా ఉంది..
నన్ను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తారు.. వారి వర్గాలతో తిట్టించరు. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతారు.. వారు రాజ్యాధికారంలో కూర్చుంటారు. కాపులు సంఘాలుగా విడిపోయాయి. బీసీలు కూడా సంఘాలుగా విడిపోయాయి. వాటిని మండల స్థాయి నుండి కలిపే ప్రయత్నాలు చేయాలి. రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాల వారికి గౌరవం ఇవ్వాలి..' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించారు.
జనసేన ప్రజల భావోద్వేగాలను నమ్మింది కానీ.. డబ్బును నమ్మలేదన్నారు. ఒక పార్టీని పెట్టి ప్రతికూల పరిస్థితుల్లో 10 సంవత్సరాలు నడపటం అంత సులువు కాదన్నారు. ఎంతో బాధ్యతతో వచ్చాను కాబట్టి నిలబడ్డానని అన్నారు. '1000 కోట్ల ప్యాకేజీ అంటారు. అసలు డబ్బుతో పార్టీలు నడపలేము. నాలో బాధ ఉంది కాబట్టి పార్టీ నడుపుతున్నాను. లక్షలాది మంది ప్రజల జీవితాల కోసం పార్టీ నడుపుతున్నాను .. నేను 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాను. కానీ వెనుదిరగలేదు.. నిలబడ్డాను, 10 సంవత్సరాలుగా మాటలు పడ్డాను, అయినా సరే నా ప్రయత్నం ఆపలేదు. ఎంత ప్రేమ లేకపోతే సమాజం మీద నేను ఇంతలా పోరాడుతాను..' అంటూ జనసేనాని చెప్పుకొచ్చారు.
Also Read: IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..
Also Read: Jammu Kashmir Crime: మరో దారుణ ఘటన.. మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి