Pawan Kalyan: హోం క్వారంటైన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్

Pawan Kalyan In Home Quarantine : ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో పలువురు కోవిడ్19 బారిన పడ్డారు. దీంతో డాక్టర్ల సూచనతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 11, 2021, 04:04 PM IST
  • ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు వకీల్ సాబ్ మూవీ ప్రమోషన్లు
  • పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్
  • డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్‌కు వెళ్లిన పవనల్ కళ్యాణ్
Pawan Kalyan: హోం క్వారంటైన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్

Janasena Chief Pawan Pawan : ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు తాను నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఈవెంట్లతో గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన వెంట ఉన్న కొందరు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. తన వద్ద పనిచేసే సిబ్బందికి కరోనా సోకడంతో టాలీవుడ్ పవర్ స్టార్ కళ్యాణ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 

ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో పలువురు కోవిడ్19 బారిన పడ్డారు. దీంతో డాక్టర్ల సూచనతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. గత వారం రోజులుగా ఆయనకు సమీపంలో ఉన్నవారు, సన్నిహితంగా మెలుగుతున్న కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో జనసేన అధినేత పవన్ క్వారంటైన్‌కు వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వర్చువల్‌గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జనసేన నాయకులతో చర్చలు జరుపుతున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Vakeel Saab Movie: వకీల్ సాబ్ మూవీ షో మధ్యలో ఆపేశారని, థియేటర్‌లో ప్రేక్షకులు విధ్వంసం Video Viral

కాగా, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు మూడేళ్ల అనంతరం పవన్ నటించిన సినిమా కావడంతో పవన్ అభిమానులు, మెగా ఫ్యాన్స్, టాలీవుడ్(Tollywood) ప్రేక్షకులు వకీల్ సాబ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లపై దాడులకు పాల్పడుతూ అవాంఛనీయ ఘటనలకు పాల్పుడుతున్నారు.  

Also Read: Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News