Jagan Tirumala visits tour cancel: తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. తిరుమలలో పోలీసులు ప్రత్యేకంగా యాక్ట్ ను సైతం అమల్లోకి తెచ్చారు. మరోవైపు కూటమి, హిందు సంఘాలు సైతం జగన్ తిరుమల ఆలయంకు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని కూడా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యలో జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఏపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మరోవైపు తాజాగా, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నాం 3 గంటలకు జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు కాసేటి క్రితమే.. ఎక్స్ వేదికగా ప్రతి ఒక్కరు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను పాటించాలని పోస్ట్ చేశారు.
భక్తుల మనోభావాలు, ఆచారాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదని చెప్పారు. కోట్లాది హిందువుల కొంగుబంగారమైన శ్రీవారి పట్ల అందరు అత్యంత పవిత్రమైన ఆలోచనలతో నడుచుకోవాలన్నారు. తిరుమలలో శ్రీవారిని భక్తులు.. నియమనిష్టలతో, శ్రద్ధాసక్తులతో స్వామి వారిని ఆరాధిస్తారు.
Read more: Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..
స్వామి వారి పవిత్రతను,తితిదే నిబంధనలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రజల్ని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్ చేసిన కాసేటికే.. మాజీ సీఎం జగన్ తన పర్యటన రద్దు చేసుకొవడం మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.