మద్యపానంపై చంద్రబాబును జగన్ నిలదీత

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Last Updated : Dec 17, 2017, 01:55 PM IST
మద్యపానంపై చంద్రబాబును జగన్ నిలదీత

అనంతపురం: చంద్రబాబు లక్షల కుటుంబాలను విఛిన్నం చేసేలా మద్యం తాగిస్తున్నారని  వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మద్యపానం విధానంపై చంద్రబాబు సర్కార్‌కు జగన్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మద్యం అంశాన్ని ప్రస్తావించిన జగన్..  రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో  ఫోన్ చేస్తే వాటర్ బాటిల్ రాదు.. మద్యం బాటిల్ వస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు బీరును హెల్త్ డ్రింక్ అని ప్రచారం చేసుకుంటున్నారు... ఆదాయం పెంచుకోవడానికి  చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని జగన్ ఆరోపించారు.

ఏటా రూ.15 వేల కోట్లు దోపిడి

ఏపీ సర్కార్ ఏటా మద్యంపైనే రూ.15 వేల కోట్లు ఆర్జిస్తోందని జగన్ ఆరోపించారు. మద్యం సప్లై ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రాల్లో నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని..జనాల చేత నేరం చేయిస్తున్నందుకు చంద్రబాబుకు ఏ శిక్ష విధించినా తక్కువేనన్నారు. చంద్రబాబుది ప్రజలను దోచుకున్న రాక్షస ప్రభుత్వం అని  వైసీపీ అధినేత జగన్ విమర్శలు సంధించారు. మద్య నిరుత్సాహ విధానాన్ని తయారు చేయాలన్నదే తమ ఆలోచన అని.. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేదిస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు.

సుబ్బమ్మ మరణానికి కారణం చంద్రబాబే..

పశ్చిమ గోదావరి జిల్లా పుత్తేపురంలో మద్యపాన నిషేదిత పోరాటం చేస్తూ అసువులు బాసిన సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని జగన్ ఆరోపించారు. ఆమె మరణానికి చంద్రబాబు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.

Trending News