Chandrababu Budget: అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రవేపెట్టిన బడ్జెట్ స్పష్టత లేదని.. మరో మేనిఫెస్టోలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని స్పష్టం చేశారు. 'బడ్జెట్ అంటే కేటాయింపులు. అలాంటిది కేటాయింపులు లేని బడ్జెట్‌గా ఉంది' అని తెలిపారు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు మళ్లీ చెప్పారని.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏడాది రూ.లక్షా 20 వేల కోట్లు కావాలని వివరించారు. మరి అన్ని కేటాయింపులు బడ్జెట్‌లో లేవని చెప్పారు.
Also Read: Ys Sharmila Satires: అసెంబ్లీకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి
బడ్జెట్ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై వైఎస్ షర్మిల బుధవారం స్పందించారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌లో స్పష్టత లేదని సూటిగా చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ప్రతి ఏడాది రూ.లక్షా 20 వేల కోట్లు కావాల్సి ఉంటే చంద్రబాబు ఈ బడ్జెట్‌లో కనీసం పావు వంతు కూడా కేటాయించ లేదని వివరించారు. మహిళా శక్తి కింద ప్రతి నెల రూ.1,500 ఇస్తానని చెప్పగా ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు.
Also read: AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
'తల్లికి వందనం కింద రూ.15 వేలు ప్రతి బిడ్డకు ఇస్తామని చెప్పగా.. వాటికి బడ్జెట్‌లో నిధులు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించారు. అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా?' అని షర్మిల ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకానికి నిధులు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారని.. పక్కా ఇళ్లు 8 లక్షలు కట్టిస్తానని చెప్పి ఇచ్చింది కేవలం రూ.4 వేల కోట్లేనని షర్మిల వివరించారు.
నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లకు రూ.800 కోట్లు కేటాయిస్తే సగం మందికి కోత విధిస్తారా అని నిలదీశారు. వీటన్నిటికీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని.. మోసపూరిత బడ్జెట్‌గా విమర్శించారు. 'ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన బడ్జెట్.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసిన బడ్జెట్' అంటూ షర్మిల విమర్శలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
YS Sharmila: దీపం పథకంలో సగం మంది మహిళలకు కోత పెడతారా? బడ్జెట్‌పై షర్మిల విమర్శలు