Fact Check: పర్యాటకంగా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే సముద్రంలో 'తేలియాడే వంతెన'ను ఏర్పాటుచేసింది. ఈ వంతెనను ఆదివారం (26 ఫిబ్రవరి) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ వంతెన ముక్కలు ముక్కలుగా కనిపించింది. వంతెన కాస్త చిందరవందరగా కనిపించడంతో ఒక్కసారిగా 'వంతెన తెగిపోయింది' అనే వార్తలు వచ్చాయి. దావానంలా వార్తలు, ఆరోపణలు రావడంతో ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు మొదలుపెట్టాయి. ప్రజలెవరూ వంతెనపై లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకున్నారు. ఈ వంతెన తెగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించడంతో వెంటనే విశాఖపట్టణం అధికారులు స్పందించారు.
Also Read: Anchor Kidnap: కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్.. 'జరిగింది ఇది' అంటూ యాంకర్ లేఖ విడుదల
బ్రిడ్జి తెగిపోవడంపై వివరణ ఇచ్చారు. అసలు బ్రిడ్జి తెగిపోలేదని తామే ముక్కలుగా విడదీశామని వివరించారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి పరిశీలనలో ఉందని వెల్లడించారు. 'ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించాం. కానీ వాతావరణంలో మార్పులతో సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండడంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి సందర్శకులను అనుమతించలేదు. సముద్రంలో పరిస్థితి బాగాలేకపోవడంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్)ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించడానికి యాంకర్ (anchor)లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచాం. అంతేకానీ బ్రిడ్జి తెగిపోలేదు' అని స్పష్టత ఇచ్చారు.
Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది
'బ్రిడ్జ్, వ్యూ పాయింట్‌ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందన్న వార్తలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాం. ఇది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి దాని టీ జంక్షన్ వ్యూ పాయింట్‌ను సాధారణ మాక్ డ్రిల్స్‌లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేశాం. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేసే ప్రక్రియ. ఇది సాంకేతిక పరిశీలనలో భాగం. భవిష్యత్తులో కూడా ఇటువంటి మాక్ డ్రిల్స్‌ను చేపడతాం' అని విశాఖపట్టణం మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. బ్రిడ్జి తెగిపోయిందని వార్తను నమ్మిన ప్రజలు ఇప్పుడు అధికారులు చేసిన ప్రకటనను చూసి నివ్వెరపోయారు. ఇక తొందరపడి విమర్శలు చేసిన ప్రతిపక్షాల నోళ్లు పడిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి