తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ను దెబ్బతీసేందుకు పన్నిన వ్యూహాలు అన్ని ఇన్నీ కావు.. ఈ క్రమంలో తన వైఖరికి భిన్నంగా జై తెలంగాణ నినాదంతో ఎన్నికల బరిలోనికి దిగారు. ఇది ఎంత వరకు లాభం చేకూర్చిందనే మాటను అటుంచితే..చంద్రబాబు నోట జై తెలంగాణ మాట రావడం అందరికీ ఆశ్చారానికి గురిచేసింది. కేసీఆర్ ను దెబ్బతీసేందుకే చంద్రబాబు జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారని కొందరు చెబుతుంటే..చంద్రబాబు చేత కేసీఆర్ జై తెలంగాణ అని పించారని మరికొందరు వాదించారు.. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నోట జై తెలంగాణ మాట వినిపించింది వాస్తవం.
సీన్ రివర్స్ అయింది..
తెలంగాణ ఎన్నికలు ముగిశారు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కేసీఆర్ కు వచ్చింది. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు..మరో అడుగు ముందుకు వేసి... అవసరమైతే ప్రత్యేక హోదా విషయంలో ప్రధానికి లేఖ రాస్తానని ప్రకటించి అందర్ని ఆశ్చరానికి గురిచేశారు. కేసీఆర్ ప్రకటనపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబును దెబ్బతీసేందుకు కేసీఆర్ ఎత్తుగడగా కొందరు దీన్ని భావిస్తుంటే... చంద్రబాబు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టి కేసీఆర్ ను ప్రత్యేక హోదా బాట పట్టించారని మరికొందరు వాదిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు శుభ పరిణామం
కేసీఆర్ తాజా ప్రకటనపై తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కొందరు దీన్ని కేసీఆర్ రిటర్నింగ్ గిఫ్ట్ అంటున్నారు..ఇంకోకరు దీన్ని రాజకీయ ఎత్తగడ అంటున్నారు. మరోకరు మరేదో అంటున్నారు. ఎవరి రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ నోట ప్రత్యేక హోదా మాట రావడం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాకు ఒక అడ్డంకి తొలిగినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు కూడా ఇలాంటి సానుకూల వైఖరినే ప్రదర్శించాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ వ్యహాలు ఎలా ఉన్న అవి తెలుగు ప్రజలకు లబ్ది చేకూర్చేలా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి