Tirupathi Pilot Project: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్‌కు అరుదైన గొప్ప అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ ప్రాజెక్టుకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎంపికైంది. ఆ ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా వన్ స్టేషన్ వన్ ప్రోడక్స్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే తొలిసారిగా తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. మార్చ్ 25వ తేదీ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ పైలట్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రమోషనల్ హబ్‌గా మార్చడం, స్థానికంగా ఉత్పత్తయ్యే వస్తువుల్ని తిరుపతి రైల్వే స్టేషన్‌లో స్టాల్స్ ద్వారా విక్రయిస్తారు. తద్వారా స్థానిక కుటీర పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది. స్థానికంగా ఉన్న కళాకారులు, కార్మికులు, గిరిజనులకు ఈ ప్రాజెక్టు ద్వారా మెరుగైన జీవనోపాధి లభిస్తుంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్నించి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్ధం వస్తుండటంతో..ఆ భక్తులకు స్థానిక కళల్ని పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు కళంకారీ కళకు ప్రసిద్ధి. కళంకారీ దుస్తులు, స్థానిక వస్త్రాలకు డిమాండ్ ఉంటుంది. ఇక నుంచి ఈ వస్తువులు, వస్త్రాలు తిరుపతి రైల్వే స్టేషన్‌లో కన్పించనున్నాయి. పైలట్ ప్రాజెక్టు తిరుపతిలో ప్రారంభమైన తరువాత అన్ని రైల్వే జోన్‌లు ఒక్కొక్క రైల్వే స్టేషన్‌ను వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తాయి. స్థానిక ఉత్పత్తుల ప్రమోషన్ కోసం తిరుపతి వంటి ప్రముఖ రైల్వే స్టేషన్లను ఇండియన్ రైల్వేస్ ఎంచుకుంటుంది. నిత్య రాకపోకలు సాగించే వేలాది ప్రయాణీకులున్నచోట..స్థానిక ఉత్పత్తుల్ని పరిచయం చేసి విక్రయించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్స్ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఉత్పుత్తుల్ని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు అవసరమైన తోడ్పాటు కూడా రైల్వే అందిస్తుంది. రైతులు, వ్యవసాయ సంస్థలకు మాత్రమే కాకుండా..దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కళల్ని , వస్థువుల్ని దేశమంతా పరిచయం చేయనుంది ఈ ప్రాజెక్టు.
Also read: Jagananna Vidya Deevena: ఏపీలో జగనన్న విద్యాదీవెన నిధులు నేడు విడుదల, అమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook