హైదరాబాద్: సంక్రాంతి పండగ కోడి పందెం రాయుళ్లకే కాకుండా దక్షిణ మధ్య రైల్వేకు కూడా కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ఈ నెల 11 నుంచి 14 వరకు దాదాపుగా 4.49 లక్షల మంది సాధారణ రైలు ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు వివిధ రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు రూ.3.99 కోట్ల ఆదాయం లభించినట్లు సంబంధిత రైల్వే అధికారులు తెలిపారు.
గతేడాది సంక్రాంతి పండగ సీజన్‌లో దాదాపు 3.79 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగా.. ఈసారి అందుకు అదనంగా మరో 18 శాతం ప్రయాణికుల సంఖ్య నమోదైంది. గతేడాది రూ.3.08 కోట్ల ఆదాయం రాగా, మరో 29% అదనపు ఆదాయం సమకూరిందని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.
రైల్వేకు కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి