AP Rains Alert: నైరుతి రుతు పపనాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అంతగా కన్పించలేదు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో లోటు కన్పిస్తోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తిరిగి కుండపోత వర్షాలు పడవచ్చని అంచనా. రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలపై పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది లేదా సాధారణ వర్షపాతంతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 35-37 శాతం వర్షపాతం లోటు కన్పిస్తోంది. అదే సమయంలో ఉత్తరాదిన మాత్రం రుతు పననాల ప్రభావం తీవ్రంగా ఉంది. రుతు పవనాలు విస్తరించే క్రమంలో తెలుగు రాష్ట్రాల పైనుంచి ఉత్తరాదికి వెళ్లి అక్కడే స్థిరపడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది.
అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఇవాళ రాత్రి, తెలంగాణలో ఈ నెల 12 నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. ఏపీలో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. ఉపరితసల ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఫలితంగా కోస్తాంధ్రతో పాటు యానాం, ఉత్తర కోస్తాలో సైతం మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాత్రి మాత్రం విశాఖ, గుంటూరు, ఉభయ ఉమ్మడి గోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
అదే విధంగా మంగళ, బుధ వారాల్లో సైతం కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, విశాఖపట్నంలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.
Also read: Telangana Rains Alert: తెలంగాణలో 36 శాతం వర్షపాతం లోటు, జూలై 12 నుంచి 5 రోజులు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook