Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు! ఇళ్లలోనే ఉండాలని ఐఎండీ వార్నింగ్..

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కూల్ వెదర్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరవగా.. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Written by - Srisailam | Last Updated : Jun 26, 2022, 08:28 AM IST
  • తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్
  • రెండు రోజుల పాటు భారీ వర్షాలు
  • అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్
Rain Alert:  తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు! ఇళ్లలోనే ఉండాలని ఐఎండీ వార్నింగ్..

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కూల్ వెదర్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరవగా.. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో భారి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్ జారీ  చేసింది భారత వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. రాబోయే 48 గంటల పాటు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి , పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలోని కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజమాబాద్, జిగిత్యాల, సిరిసిల్ల , కరీంనగర్, భూపలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ.కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు వరదలు ముంచెత్తాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను రంగంలోకి దింపింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. నాలాల వద్ద ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యం లో ట్విట్టర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.

Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News