విశాఖపట్నం: ఉత్తర తమిళనాడు పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి పవనాలు చురుగ్గా కదిలి కోస్తాలో సోమ, మంగళ, బుధవారాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, యానాంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదిలావుంటే, ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.