Amrapali Kata: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి పీఎంవోలో చోటు

యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali Kata) కి కీలక పదవి దక్కింది. ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Sep 13, 2020, 02:30 PM IST
Amrapali Kata: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి పీఎంవోలో చోటు

IAS Amrapali appointed as deputy secretary in PMO: న్యూఢిల్లీ: యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali Kata) కి కీలక పదవి దక్కింది. ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్‌తో పీఎంవో కార్యాలయంలో చోటు సంపాదించుకున్నారు. ఈ మేరకు శనివారం కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఈ పదవిలో  2023 అక్టోబరు 10 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనున్నారు.  Also read: Prashant Bhushan: మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భూషణ్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని విశాఖపట్నంలో జన్మించిన కాట ఆమ్రపాలి..  చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు. ఇదిలాఉంటే.. కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో ఆమ్రపాలితోపాటు... మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు. Also read: Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్

Trending News