Summer impact: ఈసారి వేసవి కాలం భయపెట్టనుంది. మార్చ్ నెల ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరగనుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈసారి వేసవి చాలా హాట్‌గా ఉండనుంది. ఏపీలో అప్పుడే ఎండలు రోజురోజుకూ పెరుగుతుండటం కలవరం కల్గిస్తోంది.
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా నమోదైంది. అదే విధంగా వేసవి కూడా గత ఏడాదితో పోలిస్తే తీవ్రంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అప్పుడే ఎండలు తీవ్రమయ్యాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే 5-6 డిగ్రీలు ఎక్కువే ఉండేట్టు కన్పిస్తోంది. వాతావరణ శాఖ సైతం ఇదే అంచనా వేస్తోంది. ఎండలకు తోడు వడగాల్పులు అధికంగా ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా వేసవి సీజన్ మార్చ్ నుంచి ప్రారంభమై ఏప్రిల్ వరకూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏప్రిల్, మే నెలల్లోనే పీక్ ఉంటుంది. జూన్ రెండవ వారం నుంచి ఎండలు తగ్గిపోతుంటాయి. కానీ గత ఏడాది జూన్ చివరి వరకూ ఎండల తీవ్రత కొనసాగింది. ఈ ఏడాది మార్చ్ నుంచే మొదలైపోయిది. ఈసారి కోస్తాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని , ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చ్ మూడో వారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వడగాల్పులు తీవ్రమౌతాయంటున్నారు.
గత ఏడాది మే నెలలో ఎండల తీవ్రత పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా ఏపీలోని రాజమండ్రి, ఏలూరు, విజయవాడ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 48-50 డిగ్రీల వరూ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. అదే ఇప్పుడు ఎక్కువగా భయపెడుతోంది. ఎల్ నినో ప్రభావం జూన్ వరకూ ఉండటం వల్ల అప్పటి వరకూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం అనంతపురంలో అత్యధికంగా 41,1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సమయంలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువ. ఇక కర్నూలు, నంద్యాల, నందిగామ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరుకుంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఎక్కువ నీళ్లు తాగుతుండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also read: 10th Hall Tickets 2024: ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు నేటి నుంచే, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Summer impact: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈ వేసవి తీవ్రమేనా