AP Parishad Elections | ఏపీలో పరిషత్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగనున్నాయి.
పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి సింగిల్ బెంచ్ జెడ్పీటీసీ, ఎంసీటీసీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసిందని డివిజన్ బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 28 రోజుల ఎన్నికల కోడ్ నిబంధన అమలు చేయడం తప్పనిసరి కాదని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. నేటి ఉదయం వాదనలు విన్న డివిజన్ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ పరిషత్ ఎన్నికల(AP Parishad Elections 2021)ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది.
Also Read: Zilla parishad Elections: ఓటమి భయంతోనే చంద్రబాబు బహిష్కరణ డ్రామా
పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న పరిషత్ ఎలక్షన్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
Also Read: TDP Boycott Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం
గత ప్రభుత్వ హయాంలో 2014లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా, తాజాగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయి. గతంలో 1 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవమవగా, 19 శాతం ఏకగ్రీవం అయ్యాయని.. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook