Flights Cancelled: ఏపీలో భారీ వర్షాలు, విశాఖలో 9 విమాన సర్వీసులు రద్దు

Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2024, 05:02 PM IST
Flights Cancelled: ఏపీలో భారీ వర్షాలు, విశాఖలో 9 విమాన సర్వీసులు రద్దు

Flights Cancelled: బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బల పడటంతో రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ తీరం దాటుతుండటంతో వర్షాల తీవ్రత ఉత్తరాంధ్రలో మరింతగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్లే విమాన సర్వీసులపై పడింది.

నెంబర్ 6ఈ6408 హైదరాబాద్-విశాఖపట్నం సర్వీసు రద్దయింది. అదే విధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 6ఈ779 కూడా రద్దు చేశారు. ఇక బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లే 6ఈ217 ఫ్లైట్ రద్దు చేశారు. అదే విదంగా చెన్నై-విశాఖపట్నం ఫ్లైట్ నెంబర్ 6ఈ557 రద్దయింది. ఇక విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లాల్సిన 6ఈ845 ఫ్లైట్ రద్దు చేశారు.

హైదరాబాద్-విశాఖపట్నం ఫ్లైట్ నెంబర్ 6ఈ879 విమాన సర్వీసు రద్దయింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 6ఈ 6645 విమానం కూడా రద్దు చేశారు. ఇక బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఫ్లైట్ నెంబర్ 6ఈ6366 రద్దయింది. విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే ఫ్లైట్ నెంబర్ 6ఈ5309 కూడా రద్దు చేశారు. మొత్తానికి విశాఖపట్నం హైదరాబాద్, విశాఖపట్నం చెన్నై, విశాఖపట్నం బెంగళూరు విమాన సర్వీసులపై ప్రభావం పడింది.

మరోవైపు ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇందులో భాగంగా కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. కోయంబత్తూరు నుంచి దానాపూర్ ప్రత్యేక రైలు జూలై 21 రాత్రి 11.30 గంటలకు కోయంబత్తూరు నుంచి ఉంటుంది. 

Also read: Long Weekend Dates: ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది, ఎక్కడికెళ్లాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News