ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు, వడగళ్లు పడనున్నాయి.
పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ, ఏపీవైపుకు గాలులు వీయడం వల్ల ఇవాళ్టి నుంచి వర్షాలు పడనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చ్ 20 వరకూ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక ఏపీలో కూడా రేపటి నుంచి మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. ఓ ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్నించి ఉత్తర కోస్తాంధ్ర వరకూ గ్యాంజెటిక్ పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా సముద్రమట్టానికి కేవలం 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఫలితంగా ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం మేఘావృతమై ఉంది. ఉత్తర అంతర్గత ద్రోణి తమిళనాడు నుంచి కొంకణ్ వరకూ వ్యాపించి ఉంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. ఈదులుగాలులు కూడా వీయవచ్చు.
ఇక దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. అటు రాయలసీమ ప్రాంతంలోనూ వాతావరణం ఇలానే ఉండనుంది. వెరసి రాష్ట్రం మొత్తం మీద మోస్తరు వర్షాలు రానున్న మూడ్రోజుల్లో కురవనున్నాయి. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ నెల 18 వరకూ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Also read: Intermediate Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook