ఉన్నత ఆశయంతో వైద్య వృత్తిలోకి వచ్చారు. కనీసం 3 పదుల వయసు కూడా లేదు. కానీ కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఆ యువ వైద్యుడ్ని బలి (Kadapa Government Doctor dies due to CoronaVirus) తీసుకుంది. తొలిసారి కరోనా సోకినా ధైర్యంగా ఎదుర్కున్నారు. కానీ రెండోసారి కరోనా వైరస్ సోకడంతో ఆ యంగ్ గవర్నమెంట్ డాక్టర్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఈ విషాదం (Kadapa Doctor Dies due to CoronaVirus) చోటుచేసుకుంది.
జిల్లాలోని బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో నందకుమార్(28) చిన్న పిల్లల వైద్యుడు (Children Specialist Doctor)గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట యంగ్ డాక్టర్ నందకుమార్ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడ్డారు. దాంతో ఆయన మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజులకు కోవిడ్19 (COVID-19)ను జయించారు. అనంతరం యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయి సేవలు కొనసాగిస్తున్నారు. దాదాపు రెండు వారాల కిందట ఆయనకు జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో కడప రిమ్స్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యుల సలహామేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. కానీ పరిస్థితిలో ఏ మార్పులేకపోవడంతో 2 రోజుల కిందట చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కానీ విధి వక్రించింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం నందకుమార్ మృతి చెందారు. ఎంతో ఇష్టంతో వైద్య వృత్తిలోకి వస్తే చివరికి కరోనా మహమ్మారి నందకుమార్‌ను పొట్టన పెట్టుకుందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe