Rising flood surge at Dhavaleswaram barrage: భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం రాత్రికి తూర్పుగోదావరి జిల్లా ధవళ్వేరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.70 అడుగులగా నమోదైంది. అంతేకాకుండా 9 లక్షల 73వేల 870 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీపరివాహక ప్రాంతాల్లోని గ్రామాలన్నీ జలదిగ్భందమయ్యాయి. వరద ఉద్ధృతి పెరుగతూ ఉండటంతో ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కనకాయలంక కాజ్ వే ముంపు బారిన పడింది. దీంతో లంక గ్రామ ప్రజలు పి.గన్నవరం మండలం చాకలిపాలెం వైపు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు.
దవళేశ్వరం బ్యారేజీ వద్ద గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద ఇప్పటికే మెుదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది. శబరి నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండు నదుల్లో ఉప్పొంగి ప్రవహించడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చాలా గ్రామాలకు మండల కేంద్రం నుండి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దేవీపట్నం మండలంలో పోశమ్మ గుడి వరదనీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని షూట్లలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Also Read: Chandrababu Naidu: పవన్‌పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook