TDP నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Jun 13, 2020, 09:08 AM IST
TDP నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి (JC Prabhakar Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లో శనివారం ఉదయం ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి విక్రయిస్తున్నారన్న కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని పోలీసులు అనంతరపురం తరలిస్తున్నారు.  ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

154 బస్సులు నకిలీ నిరభ్యంతర పత్రాలు (NOC), నకిలీ ఇన్సూరెన్స్ ఆరోపణలున్నాయి. గతంలో కేసు నమోదైంది. ఆ వాహనాలను ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్, తదితర రాష్ట్రాల్లో విక్రయించారని, పైగా నాలుగైదు వాహనాలకు ఒకే ఇన్సూరెన్స్ పేపర్ చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు.  Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 95 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. మిగతా వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నదానిపై ఇన్సూరెన్స్ కంపెనీల సమాచారంతో వెతికి గుర్తించనున్నారు. దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ సైతం ఇటీవల ఫిర్యాదు చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy Arrest)తో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

Trending News