Pendem Dorababu Resigns to YSRCP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లు.. పార్టీ ఓటమిలో ఉంటే ఒక్కొక్కరు రాజీనామా చేసి వెళ్లిపోతుండడం క్యాడర్‌ను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. కీలక నేతల రాజీనామాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోకి వెళుతున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమిలో ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. పిఠాపురం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని పేర్కొన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయం తెలియదన్నారు.
పిఠాపురం నుంచి 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పెండెం దొరబాబును కాదని వంగా గీతకు టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్. టికెట్ ఇవ్వకపోకవడంతో అసంతృప్తిగా గురైన ఆయన.. అయినా వైసీపీలోనే కొనసాగారు. అయిష్టంగానే వంగా గెలుపు కోసం పని చేశారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి తరువాత ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా నిర్వహించినా పట్టించుకోలేదు. చాలా రోజుల నుంచే పెండెం దొరబాబు పార్టీ మారుతున్నారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన అధికారికంగా ప్రకటంచారు. జనసేన పార్టీలో చేరేందుకు మార్గం సుముగం చేసుకున్నారు. తాను పదవులు ఆశించి పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు.
Also Read: Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.