Prasada Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

IPS Prasada Rao Death News: అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు చికిత్స పొందుతూనే ఆదివారం అర్ధరాత్రి ప్రసాదరావు హఠాన్మరణం చెందారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 10, 2021, 10:23 AM IST
Prasada Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

Prasada Rao Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు చికిత్స పొందుతూనే ఆదివారం అర్ధరాత్రి ప్రసాదరావు హఠాన్మరణం చెందారు. 30 అక్టోబర్ 2013న ఉమ్మడి ఏపీకి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరావు మే 2014 వరకు పోలీస్ బాస్‌గా సేవలు అందించారు. 

ప్రసాదరావు 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ అధికారి. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి గ్రేటర్ నగరాలకు పోలీస్ కమిషనర్‌గా సేవలు అందించారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు పోలీస్ బాస్‌గా వ్యవహరించారు. తన సేవలకు గుర్తింపుగా పోలీస్ మెడల్ (1997), రాష్ట్రపతి మెడల్ 2006లో అందుకున్నారు. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, వైస్ చైర్మన్‌గా సేవలు అందించారు.

Also Read: COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News