RTC Fares Increased: దసరా పండుగ సందర్భంగా ప్రజలు వారి వారి స్వస్థాలకు చేరుకునే విధంగా సరిపోయేన్ని బస్సులు నడపాలని.. వీటి కోసం స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
దీనితో పాటుగా స్పెషల్ బస్సులపై ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ చార్జీలు వసులు చేసేందుకు సిద్ధం అవుతుంది. కాగా.. సెప్షల్ బస్సులలో 50 శాతం బస్సు చార్జీ పెంచనున్నట్లు తిరుమలరావు తెలిపారు.
Also Read: IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది
ఓ వైపు బస్సు ఖాళీగా వెళ్తుంది కావున, స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచుతున్నామని తెలిపారు మరియు రెగ్యులర్ బస్సు చార్జీలతో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. అంతేకాకుండా రెగ్యులర్ బస్సు సర్వీసులలో ఎలాంటి అంతరాయం ఉండదని కూడా ఆయన పేర్కొన్నారు.
దసరా పండగ సమీస్తున్న కారణంగా ఈ నెల 8 వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మరియు దాదాపు 4 వేల బస్సులు స్పెషల్ సర్వీసు కోసం నడపనున్నట్లు తెలిపారు
అవకాశాన్ని వినియోగించుకోవాలనో.... లేక మోసం చేయాలనో.... ప్రజలను దోచేయాలనో ఈ నిర్ణయం తీసుకోలేదని..... ఆర్టీసీ సంస్థ మనుగడ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్ రెగ్యులర్ బస్సు సర్వీసులు టికెట్లు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని తెలిపారు
Also Read: Navratri 2021: దేవీ నవరాత్రుల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలని అధిగమించటానికే, కార్గో సేవలను పెంచమని, జాబ్స్ నియామకాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియపారు. పెరుగున్న డీజిల్ రేట్ల వలన ఆర్టీసీ సంస్థపై తీవ్ర భారం పడుతుందని.. వీటిని దృష్టిలో ఉంచుకొని, ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook