త్వరలో జనసేనలోకి ముత్తా గోపాలకృష్ణ

మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారు.

Last Updated : Aug 6, 2018, 11:00 PM IST
త్వరలో జనసేనలోకి ముత్తా గోపాలకృష్ణ

మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఆదివారం సాయంత్రం ముత్తా భేటీ అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముత్తాను పవన్ జనసేనలోకి రావాలని ఆహ్వానించగా.. అందుకు ఆయన అంగీకరించారు. జనసేన పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కీలక సభ్యుడిగా ముత్తా గోపాలకృష్ణను నియమించినట్లు పవన్ తెలిపారు.  

మరోవైపు ఆగస్టు 14న జనసేన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యావ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదాపై చర్చించిన పీఏసీ... ఫిన్లాండ్ తరహాలో విద్యావిధానాలను ఏపీలో దశలవారీగా అమలు చేసేలా అధ్యయనం చేస్తోంది.

అటు ఈరోజు పవన్ కల్యాణ్‌ కర్నూలు జిల్లా హత్తిన బెళగల్‌కు బయల్దేరివెళ్లారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన వెళ్లి.. పేలుడు సంభవించిన క్వారీ ప్రదేశాన్ని సందర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం కర్నూలు సర్వజన వైద్యశాలలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పవన్ కల్యాణ్‌ పరామర్శిస్తారు.

Trending News