Kollu Ravindra: కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో ( Kollu Ravindra's bail plea) చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జిల్లా కోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టిపారేసింది.

Last Updated : Jul 30, 2020, 10:25 PM IST
Kollu Ravindra: కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు

విజయవాడ: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో ( Kollu Ravindra's bail plea) చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జిల్లా కోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టిపారేసింది. మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర రావు హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న కొల్లు రవీంద్ర ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి హోదాలో ఉన్న కొల్లు రవీంద్ర బెయిల్‌పై బయటికొస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన నేపథ్యంలో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. Also read: AP Ex Minister: వైసీపీ నేత హత్యకేసులో సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి

ఇదే కేసులో ( Moka Bhaskar Rao murder case) నిందితులుగా ఉన్న చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా నాంచారయ్య (పులి), చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలకు సైతం కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. Also read: COVID-19 in AP: 24 గంటల్లో 68 మంది మృతి

Trending News