Harirama Jogaiah Writes Letter To Minister Gudivada Amarnath: ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావంటూ ఘాటు లేఖ రాశారు. 'డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు కాదని.. పరోక్షంగా టీడీపీ కార్యకర్త అంటూ సెటైర్లు కూడా వేశారు. రానున్న ఎన్నికల్లో జనసేనకు వచ్చే ఓట్ల కంటే.. నోటాకే ఎక్కువ ఓట్లు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. కాపులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపించారు. పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో హరిరామజోగయ్య లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. జనసేన నాయకులు కూడా మంత్రి అమర్‌నాథ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ లేఖకు మంత్రి గుడివాడ కూడా రిప్లై ఇచ్చారు. గౌరవనీయులైన హరిరామజోగయ్య గార్కి.. అంటూ మొదలుపెట్టారు. 'కాపుల భవిష్యత్ విషయంలో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గారికి రాయవలసిన.. చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాసినారు. మీకు ఆయురారోగ్యాలతో, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను..' అంటూ ఆయన లేఖ రాశారు..
కాగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇటీవల హరిరామజోగయ్య నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామన్నారు. రాష్ట్రానికి జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు, అనుభవం అవసరమన్నారు. వయసు రీత్యా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని హరిరామజోగయ్యను పవన్ కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ సూచనతో ఆయన దీక్ష విరమించారు.
Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
Also Read: Pervez Musharraf: బిగ్ బ్రేకింగ్.. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook