YS Jagan Flood Relief: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన వరద బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవనుంది. వరద బాధితుల సహాయం కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించగా.. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ డబ్బులతో వరద బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు వైసీపీ సిద్ధమైంది.
వరద బాధితుల కోసం మాజీ సీఎం జగన్ ప్రకటించిన రూ.కోటితో.. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఒక నెల జీతంతో ఇప్పటికే రెండు దశలలో బాధితులకు సహాయం అందించారు. మంగళవారం నుంచి మూడో విడతలో వరద సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేషన్ సరుకులతో కూడిన రూ.50 వేల ప్రత్యేక ప్యాకెట్లు వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేయగా.. రెండో దశలో 75 వేల పాల ప్యాకెట్లు, లక్ష వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. 17వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న స్పెషల్ ప్యాకెట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు.
Also Read: Chandrababu: వంద రోజుల చంద్రబాబు పాలన.. ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనుందా?
సహాయ చర్యలు ఇలా..
తొలి దశ: లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు
రెండో దశ: 75 వేల పాల ప్యాకెట్లు, లక్ష వాటర్ బాటిళ్లు
మూడో దశ: రూ.50 వేల విలువైన సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ
పరిశీలన..
సరుకులతో కూడిన ప్యాకెట్లో బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మా రవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర పదార్థాలు ఉంటాయి. మంగళవారం 30 వేల ప్యాకెట్లు, బుధవారం 20 వేల ప్యాకెట్లను వరద బాధితులకు అందించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ హనుమాన్ పేటలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, మల్లాది విష్టు, దేవినేని అవినాష్, ఆసిఫ్ తదితరులు పరిశీలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.