Eluru mystery disease: అంతుచిక్కని ఏలూరు వింత వ్యాధి లక్షణాలు..జాగ్రత్తలు

Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధికి కారణాలు అంతుబట్టడం లేదు. మరోవైపు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్రం ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిస్తోంది. అసలీ వింత వ్యాధి లక్షణాలేంటనేది పరీశీలిద్దాం..

Last Updated : Dec 7, 2020, 08:28 PM IST
  • అంతు చిక్కని ఏలూరు వింత వ్యాధి, పెరుగుతున్న కేసులు
  • రేపు ఏలూరుకు రానున్న కేంద్రం ప్రత్యేక నిపుణుల బృందం
  • ఏలూరు వింత వ్యాధి లక్షణాల్ని ప్రకటించిన వైద్యులు
Eluru mystery disease: అంతుచిక్కని ఏలూరు వింత వ్యాధి లక్షణాలు..జాగ్రత్తలు

Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధికి కారణాలు అంతుబట్టడం లేదు. మరోవైపు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్రం ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిస్తోంది. అసలీ వింత వ్యాధి లక్షణాలేంటనేది పరీశీలిద్దాం..

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అస్వస్థత ఘటన ( Eluru Disease ) రాష్ట్రవ్యాప్తంగా కలవరం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ( Ap minister Alla nani ) స్వయంగా దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఏలూరు చేరుకుని..బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Central minister kishan reddy ) ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏలూరుకు పంపిస్తోంది కేంద్రం. కేంద్రం పంపిస్తున్న ప్రత్యేక నిపుణుల బృందం రేపు ఏలూరుకు చేరుకోనుంది. 

ఇటు వింత వ్యాధి ( Mystery Disease ) బాధితుల సంఖ్య 450కు పెరిగింది. ప్రతి గంటకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రేపు సాయంత్రానికి ప్రాధమిక నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకూ పరిశీలించిన కేసుల ఆధారంగా వింత వ్యాధి లక్షణాలేేంటనేది వైద్యులు ప్రకటించారు. Also read: AP: ఏలూరు ఘటనపై స్పందించిన కేంద్రం, రేపు బాధితుల్ని పరామర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వింత వ్యాధి లక్షణాలు ( Mystery Disease symptoms )

3-5 నిమిషాల సేపు మూర్చ వస్తుంది. మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం వ్యాధి లక్షణాలుగా వైద్యులు తెలిపారు. మున్సిపల్ నీళ్లే కాకుండా మినరల్ వాటర్ తాగేవారిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. 22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా...సాధారణంగానే ఉన్నాయి. 52 రక్త నమూనాలు సాధారణంగానే ఉన్నాయి. అటు 35 సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిల్స్‌లో సెల్ కౌంట్ కూడా నార్మల్ గానే వచ్చింది. 45 మందికి సిటీ స్కాన్ చేయగా నార్మల్ వచ్చింది. 9 పాల నమూనాలు పరీక్షించగా సాధారణంగానే ఉన్నాయి. సెల్యులర్ అండ్ మాలిక్యులర్ విశ్లేషణ కోసం హైదరాబాద్ లోని సీసీఎంబీ (CCMB )కు పది శాంపిల్స్ పంపించగా..ఫలితాలు ఇంకా రావల్సి ఉంది. 

ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లో 50 బెడ్లు, 12 మంది వైద్యులు, 4 ఆంబులెన్సులు, 36 మంది నర్శింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నారు. ఏలూరు నుంచి విజయవాడకు ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం పంపించారు. Also read: Eluru Mysterious Disease: ఏలూరులో వింత వ్యాధి.. WHO సహాయం కోరిన జగన్

Trending News