Eluru mystery Disease: ఏలూరు వింత వ్యాధి మిస్టరీ వీడింది..

Eluru mystery Disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు వింత వ్యాధి ఘటన మిస్టరీ వీడింది. పూర్తి స్థాయి నివేదిక అందింది. దీర్ఘకాలిక అధ్యయనం అవసరమని నివేదిక తేల్చింది.

Last Updated : Dec 16, 2020, 06:54 PM IST
Eluru mystery Disease: ఏలూరు వింత వ్యాధి మిస్టరీ వీడింది..

Eluru mystery Disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు వింత వ్యాధి ఘటన మిస్టరీ వీడింది. పూర్తి స్థాయి నివేదిక అందింది. దీర్ఘకాలిక అధ్యయనం అవసరమని నివేదిక తేల్చింది.

ఏలూరు వింత వ్యాధి ( Eluru mystery Disease ) ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర నిపుణుల బృందాలు ఏలూరు చేరుకుని అంతు చిక్కని వ్యాధి గురించి పరీక్షలు చేశారు. ఏలూరు ఘటనపై ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) మరోసారి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ( Health minister Alla nani ), కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర వైద్యాధికార్లు సమీక్షలో పాల్గొన్నారు. 

ఏలూరు వింత వ్యాధి ఘటన మిస్టరీ వీడిందని సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. ఢిల్లీ ఎయిమ్స్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వంటి సంస్థలు అందించిన పూర్తి నివేదిక సారాంశాన్ని వివరించారు. వింత వ్యాధికి  కారణం పురుగు మందుల అవశేషాలేనని ఢిల్లీ ఎయమ్స్‌ ( Delhi Aiims )తో పాటు ఇతర సంస్థలు పూర్తి నివేదిక ఇచ్చాయి. 

అయితే ఈ పురుగు మందు అవశేషాలు మానవ శరీరంలో ఎలా వెళ్లాయనేదానిపై దీర్ఘకాలంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన బాధ్యతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( National institute of chemical technology )కు అప్పగించారు. 

ఈ సందర్భంగా అధికార్లకు కొన్ని సూచనలు జారీ చేశారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని..ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాల్ని పరీక్షించాలన్నారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకూడదన్నారు. Also read: AP: తిరుపతి ఉప ఎన్నికలపై వైసీపీ ప్రత్యేక దృష్టి..అందుకే ఆ నిర్ణయం

Trending News