AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2024, 12:20 PM IST
AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. వైనాట్ 175 లక్ష్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకమై కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఈ క్రమంలో ఎలెసెన్స్ సంస్థ ఇటీవల జరిపిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. 

ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 12 వరకూ జరిపిన సర్వే ఇది. మొత్తంగా 86,200 శాంపిల్ తీసుకున్నారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీని పరిగణలో తీసుకుంది ఎలెసెన్స్ సంస్థ. ఏ జిల్లాల్లో ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయో లెక్క తేల్చింది. ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుందని తేల్చి చెప్పింది. 

ఏపీలో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా 50.38 శాతం ఓటు షేర్ సాధించి 127 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. అటు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మాత్రం 45.58 శాతానికే పరిమితమై 48 స్థానాల్లో విజయం సాధించనుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 1.38 శాతం ఓటు షేరు సాధిస్తుందని ఖాతా మాత్రం తెరవదని ఎలెసెన్స్ సర్వే వెల్లడించింది. జిల్లాల వారీగా ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది వివరించింది. ఉమ్మడి జిల్లాల పరంగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లోనూ, కూటమి 2 స్థానాల్లోనూ విజయం సాధించనుంది. ఇక విజయనగరం జిల్లాలో వైసీపీ 8, కూటమి1 స్థానం కైవసం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో మాత్రం అధికార పార్టీకు షాక్ తగలనుంది. జిల్లాలో వైసీపీ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా కూటమి 8 స్థానాలు గెల్చుకోవచ్చు. ఇక జనసేన ప్రాబల్యం అధికంగా ఉందని భావిస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని చెప్పడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 9, కూటమి 9 స్థానాలు గెల్చుకోగా, ఇతరులు 1 స్థానం గెల్చుకోవచ్చు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ 8, కూటమి 7 స్థానాలు గెల్చుకోనున్నాయి. 

ఎలెసెన్స్ సంస్థ సర్వే ప్రకారం అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా మరోసారి కన్పించనుంది. కృష్ణా జిల్లాలో వైసీపీకు 10, కూటమికి 5 స్థానాలు రావచ్చు. గుంటూరులో వైసీపీ 9, కూటమి 2, ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ 9, కూటమి 2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధిస్తారు. నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ ఆధిపత్యం చెలాయించనుంది. ఈ జిల్లాలో వైసీపీ 9 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ విజయం సాధించవచ్చు. ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీ 12 స్థానాల్లో, కూటమి 1 స్థానంలో, ఇతరులు మరో స్థానం గెల్చుకోవచ్చు. 

ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సైతం వైసీపీ హవా వీయనుంది. చిత్తూరులో వైసీపీ 12 స్థానాల్లో, కూటమి 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో విజయం సాదించవచ్చు. కడపలో 10 స్థానాలు గెల్చుకుని క్లీన్‌స్వీప్ చేయవచ్చు. అనంతపురంలో వైసీపీ 12 స్థానాలు, కూటమి 1 స్థానంలో విజయం సాధిస్తే ఇతరులు మరో స్థానంలో విజయం సాధించవచ్చు. కర్నూలులో వైసీపీ 13 స్థానాల్లోనూ కూటమి 1 స్థానంలోనూ విజయం సాధించవచ్చు. ఈ సర్వేలో పోటా పోటీ ఉన్న స్థానాలను ఇతరుల కేటగరీలో లెక్కగట్టింది. 

Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News