సంకాంత్రి జరుపుకునేందుకు ఊరెళ్తున్నారా?...అయితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

నగరంలో దొంగలున్నారు జాగ్రత్త సుమా ! ఉళ్లకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం మరిచిపోకండి.

Last Updated : Jan 10, 2019, 01:27 PM IST
సంకాంత్రి జరుపుకునేందుకు ఊరెళ్తున్నారా?...అయితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరం దొంగలకు అడ్డాగా మారింది. ఇళ్లలో మనుషులు లేని సమయం చూసి..పగడ్భంధీగా చోరీలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలెకాలంలో ఈ కేసులు అనేకంగా నమోదవుతున్న నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ సొంతూళ్లకు వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. ఊళ్లకు వెళ్లేవారు సంబంధిత ఏరియాకి చెందిన ఎస్సైకి సమాచారం ఇస్తే రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పెంచడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరుగు పొరుగు వారికీ చెప్పాలని సూచించారు. సంక్రాంతికి పర్వదినం నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్ళేవారి సంఖ్య అధికంగా ఉండటంతో సీపీ అంజనీకుమార్ ఈ మేరకు సూచనలు చేశారు

Trending News