అమరావతి: ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 55,551 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 9,393 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. మరోవైపు అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 95 మంది చనిపోయారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య విషయానికొస్తే.. చిత్తూరులో 16 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, నెల్లూరు జిల్లాలో తొమ్మిది మంది, అనంతపురంలో 8 మంది, తూర్పు గోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది, కడప జిల్లాలో ఏడుగురు, గుంటూరు జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో ( COVID-19 death toll ) మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 3001కి చేరుకుంది. ఇది కూడా చదవండి : Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి
ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం.. గత 24 గంటల్లో 8,846 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో నేటివరకు 30,74,847 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 3,25,396 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇది కూడా చదవండి : Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు