AP Disputes: జగన్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ.. సినిమా టికెట్లు, ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాలు..ఎలా చెక్ పెట్టబోతోంది..?

AP Disputes: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై సమర్ధన, విమర్శ రెండూ ఉంటున్నాయి. నిన్న ఉద్యోగుల సమ్మె..ఇప్పుడు బాలకృష్ణ మౌనదీక్ష. రాష్ట్రంలోని పరిణామాలపై ఫోకస్

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2022, 12:39 PM IST
AP Disputes: జగన్ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ.. సినిమా టికెట్లు, ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాలు..ఎలా చెక్ పెట్టబోతోంది..?

AP Disputes of employees strike, movie tickets issue, new district, how cm jagan will solve: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై సమర్ధన, విమర్శ రెండూ ఉంటున్నాయి. నిన్న ఉద్యోగుల సమ్మె..ఇప్పుడు బాలకృష్ణ మౌనదీక్ష. రాష్ట్రంలోని పరిణామాలపై ఫోకస్

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys Jagan Government) వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం నుంచి ఆ వర్గంలో వ్యతిరేకత పెల్లుబికిన సంగతి తెలిసిందే. పేదవారికి కూడా వినోదం పంచివ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంటే..నష్టపోతామనేది సినీ వర్గాల వాదనగా ఉంది. ఆర్జీవీ వంటి వ్యక్తులైతే ప్రభుత్వానికి ఆ అధికారమే లేదనే వాదనకు దిగుతున్నారు. అయితే సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అదే పరిశ్రమలో సమర్ధించేవాళ్లు కూడా ఉన్నారు. పేదలకు వినోదాన్ని అందించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకించడం మంచిది కాదని కళ్యాణ్ వంటి నిర్మాతలు సూచించిన పరిస్థితి ఉంది. సినీ పరిశ్రమలో ఓ వర్గం ఆధిపత్యమే..ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు కారణమని వాదించేవాళ్లు లేకపోలేదు. 

సినీ టికెట్ల వివాదం  సమసిపోకముందే...కొత్త పీఆర్సీల ((PRC Issue) వ్యవహారం తెరపైకొచ్చింది. నెమ్మదిగా ప్రారంభమైన ఉద్యమం విజయవాడ ధర్నాత తారాస్థాయికి చేరింది. పోలీసుల అరెస్టులు, చెక్ పోస్టుల ద్వారా నియంత్రణ తొలుత ఉన్నా..ఆ తరువాత పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారు. ఫలితంగా విజయవాడ ఉద్యోగుల ధర్నా విజయవంతమైంది. విజయవాడ రోడ్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడ ధర్నా విజయవంతం కావడంతో ప్రతిపక్షాల విమర్శలు జోరందుకున్నాయి. విజయవాడలో ఉద్యోగులతో కిక్కిరిసిన రోడ్లే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే సంకేతాలు ప్రారంభించారు. అయితే విజయవాడలో కన్పించిన జనమంతా..ఉద్యోగులు కాదని..అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా జనం తరలించారని అధికార పార్టీ వర్గాలు వాదన ప్రారంభించాయి. అటు ప్రభుత్వం కూడా సమ్మెలతో, ధర్నాలతో సమస్యలు పరిష్కారం కావని..చర్చలకు రావాలని పదే పదే పిలుపునిస్తూనే ఉంది. ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయం ఇవాళ తేలనుంది.

ఇదిలా ఉండగానే ఏపీ ప్రభుత్వం (Ap Government) తీసుకున్న మరో నిర్ణయంపై మెజార్టీ జిల్లాల్లో హర్షం వ్యక్తమైంది. రాజంపేట, హిందూపురం, రంపచోడవరం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా హిందూపురంను జిల్లా రాజధానిగా ప్రకటించకుండా..పుట్టపర్తిని ప్రకటించడం వివాదానికి కారణమైంది. హిందూపురంను (Hindupuram) జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్షకు (Balakrishna Mouna Diksha) దిగారు. హిందూపురం పట్టణంలో భారీ ర్యాలీ తరువాత మౌనదీక్షకు దిగనున్నారు. 

మొత్తానికి సినీ టికెట్ల వివాదం (Movie Tickets Issue), ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాలపై వ్యతిరేకత నేపధ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందనేది ప్రతిపక్షాల వాదన కాగా..మెజార్టీ ప్రజల మద్దతు తమకే ఉందనేది ప్రభుత్వ వర్గాల వాదనగా ఉంది. పదిమందికీ ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమందిలో వ్యతిరేకత సహజమేనని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. మరి ఈ మూడు వివాదాలకు ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తిగా మారింది. 

Also read: AP Teachers: టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... త్వరలో 30 వేల మందికి ప్రమోషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News