'యాత్ర'లో జగన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

యాత్ర మూవీలో జగన్ పాత్ర పై దర్శకుడు మహి.వి రాఘవ స్పందించారు

Last Updated : Jan 31, 2019, 07:04 PM IST
'యాత్ర'లో జగన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా ' యాత్ర' మూవీ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.ఈ నేఫథ్యంలో ఇందులో జగన్ పాత్ర ఎలా ఉంటుందనేది చర్చనీయంశంగా మారింది.  ఈ విషయంపై దర్శకుడు మహి.వి రాఘవ్ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తయారు చేసుకున్న కథ వైఎస్ ను ఫోకస్ చేస్తూనే కొనసాగుతుంది..అయితే సినిమాలో జగన్ పాత్ర ఉండదని తేల్చి చెప్పాడు

ఇది బయోపిక్ కాదు...
 'యాత్ర' మూవీ గురించి దర్శకుడు మహి వి.రాఘవ మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ  సినిమాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గానే అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇది ఒక బయోపిక్ గా భావించవద్దన్న రాఘవ..ఇది యధార్థ సంఘటనలను ఒక కథగా ఆవిష్కరిస్తున్నాన్నాడు. ఈ సినిమా 30 శాతం రాజకీయాలకి సంబంధించిన నేపథ్యంలో కొనసాగుతుందని... మిగిలిన కథ అంతా కూడా హ్యూమన్ డ్రామాగా నడుస్తుందని వివరించారు. రాజశేఖర్ రెడ్డి పాత్రను హైలైట్ చేయడం కోసం ఎవరి పాత్రను తక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదని దర్శకుడు మహి.వి రాఘవ వివరించారు 

Trending News