Pawan vs Chintamaneni: నాడు నువ్వెంతంటే నువ్వెంత...ఇప్పుడేమో సీటు త్యాగం చేస్తానంటూ బంపరాఫర్

Pawan vs Chintamaneni: మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరూ బద్ధ శత్రువులు. ఒకరు కాళ్లు విరగ్గొడతానంటే మరొకరు మక్కెలు విరగ్గొడతానని హెచ్చరించుకున్నారు. ఒకరికొకరు ఖబడ్దార్ అంటూ వార్నింగులు, నువ్వెంతంటే నువ్వెంతని సవాలు విసురుకున్నవాళ్లే.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 05:33 PM IST
Pawan vs Chintamaneni: నాడు నువ్వెంతంటే నువ్వెంత...ఇప్పుడేమో సీటు త్యాగం చేస్తానంటూ బంపరాఫర్

Pawan vs Chintamaneni: ఇప్పుడు పరిస్థితి మారింది. కౌగిలించుకుందా రా అనుకుంటున్నారు. ఒకప్పుడు మక్కెలు విరగ్గొడతానని చెప్పిన వ్యక్తే...తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భుజాలనెత్తుకుని గెలిపిస్తానని బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ కథ దెందులూరుది. పవన్ కళ్యాణ్ వర్సెస్ చింతమనేని ప్రభాకర్ వ్యవహారమిది. 

2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్రలో భాగంగా నాటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చింతమనేని దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారని..ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. తానొక్క సైగ చేస్తే చింతమనేనిని కాళ్లు విరగ్గొడతారంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా 16 ఏళ్ల వయస్సులోనే రౌడీల్ని తరిమేశానని గుర్తు చేస్తూ ఖబడ్దార్ చింతమనేని అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఇక చింతమనేని కూడా తక్కువ తినలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. తాను అసెంబ్లీ రౌడీనేనని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రౌడీయిజం చేస్తానని సమాధానమిచ్చారు. రౌడీయిజం చేస్తే మక్కెలు విరగ్గొడతానని పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించారు. 

ఇప్పుడు పరిస్థితి మారింది. దెందులూరు టీటీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా టికెట్ ఖరారు చేసుకున్న చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను భుజాలనెత్తుకుని గెలిపిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు చింతమనేని. చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ, జనసేనలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య ఇంకా పొత్తు నిర్ధారణ కాలేదు. పొత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా సరే దెందులూరు టికెట్ చింతమనేనికేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే నిర్ధారించేశారు. 

ఈ క్రమంలో పార్టీ అధినేత నిర్ణయాన్ని కాదని చింతమనేని ప్రభాకర్..తన సీటును పవన్ కళ్యాణ్‌కు ఆఫర్ చేయడంలో అర్ధమేంటనే చర్చ ప్రారంభమైంది. కాపు సామాజికవర్గాన్నిఆకట్టుకునేందుకే ఈ ఆఫర్ ఇచ్చారా లేక నిజంగానే సీటు త్యాగం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా చింతమనేనికి జనసేనలో చేరే ఉద్దేశ్యముందా అనే కోణంలో కూడా చర్చ రేగుతోంది. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News